AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు రద్దు చేయాలని సిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. నిందితుల తరపున వాదనలు నిరంజన్ రెడ్డి వినిపించగా సిట్ తరపున వాదనలు సిద్ధార్ధ లూథ్రా వినిపించారు. సిద్ధార్ధ లుథ్రా వాదనలలో భాగంగా…
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది..
విజయవాడలో ఐదు రోజుల పాటు జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 24వ జాతీయ మహాసభలు ముగిశాయి… చివరి రోజైన ఇవాళ నూతన జాతీయ సమితిని ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత నూతన జాతీయ సమితి డి.రాజాను ఏకగ్రీవంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది… దీంతో.. రెండోసారి ఏకగ్రీవం రాజా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. కాగా, 2018లో కేరళలోని కొల్లాంలో జరిగిన 23వ జాతీయ మహాసభలో సురవరం సుధాకర్‌రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికకాగా.. ఆయన…
బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ వంటి వారు రాజకీయం చేసేవారు. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత ఒకట్రోండు సందర్భాల్లోనూ గొడవలు బహిర్గతమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి.. కేశినేని నాని పార్టీ అధినాయకత్వంతో సఖ్యతగా ఉండడం మొదలు పెట్టారు. అయితే బెజవాడ…
దుర్గగుడిలో వెండి రథంలో మిస్సయిన నాలుగు సింహాలు అమర్చినందుకు గాను సాయంత్రం రథోత్సవానికి లైన్ క్లియర్ అయింది. వెండి రథంలో నాలుగు సింహాలు కొత్తవి అమర్చారు దుర్గగుడి అధికారులు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. నాలుగో సింహం చోరీకి యత్నించి విఫలం అయ్యారు దుండగులు. ప్రస్తుతం నాలుగు సింహాలు వెండి రథంలో యధాస్థానంలో తిరిగి దుర్గగుడి అధికారులు నిర్మించారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో హైదరాబాద్…