Kesineni Nani: నిన్నటి నిన్నే టీడీపీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని.. అదే దూకుడు చూపిస్తున్నారు.. ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.. ఎంపీ కేశినేని నాని సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రాజకీయ చైతన్యం ఎక్కువ…
MP Kesineni: టీడీపీ సీనియర్ నేత, బెజవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీలతో నాకు పని లేదు.. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంటుగా గెలిపిస్తారు.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అంటూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నేనెక్కడా చెప్పలేదన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని…
Minister Srinivas Goud: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వచ్చాను.. దర్శనం బాగా జరిగిందన్న ఆయన.. రాష్ట్ర విభజన ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గొడవలు లేకుండా ఉన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతాయి అన్నారు.. జరిగాయా? అని ప్రశ్నించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్న ఆయన..…
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహా ఇచ్చారు.
Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలంటే నేనే సామంతరాజును అని ఫీల్ కాకూడదని సూచించారు. తానే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి.. తానే 8 సార్లు మంత్రి అవ్వాలంటే కుదరదన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన చేయాలని కేశినేని నాని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసలు ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తానే రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలోకి ఈడ్చి కొడతారని ఘాటు…
Ease Of Living: దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీలోని మూడు పట్టణాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో గుంటూరు ఆరో స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఈ ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్…
Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన తండ్రి టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలవడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని కుమార్తె పెళ్లికి తన తండ్రి వసంత నాగేశ్వరరావు వెళ్లలేకపోయారని.. పెళ్లికి వెళ్లలేదు కాబట్టే కర్టసీగా కేశినేని నానిని పలకరించడానికి వెళ్లారని తెలిపారు. కేశినేని నానితో తన తండ్రి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. మరోవైపు తన…
Vijayawada: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని…
Justice Nageswara Rao: విద్యార్థులుగా సరైన సమయంలో సరైన స్టెప్ వేస్తే రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చినవారు అవుతారని తెలిపారు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర రావు.. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీలో లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల పరిష్కారంలో డీలే ఉందన్నారు..…
Vijayawada: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతిచెందారు.. విజయవాడలోని డీవీ మనార్ హోటల్లోని రూంలో విగతజీవిగా పడి ఉన్న శివ కుమార్ రాజు ( 74 )ను గుర్తించారు హోటల్ సిబ్బంది.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ గా గుర్తించారు.. అయితే, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు.. పాత కేసుల ఎవిడెన్స్ కోసం కోర్టుకు హాజరు నిమిత్తం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లిన శివకుమార్ రాజు.. ఈ నెల…