Kesineni Chinni: కేశినేని బ్రదర్స్.. నాని కామెంట్లపై చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Chinni:కేశినేని బ్రదర్స్ వ్యవహారం ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా బెజవాడ పాలిటిక్స్‌లో హీట్ పెంచింది.. అయితే, ఈ మధ్య ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. పార్టీ అధిష్టానంపై సంచల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఎంపీ కేశినేని నాని.. నాకు ఎవరూ సీటు ఇవ్వాల్సి అవసరం లేదు.. పోటీ చేస్తే గెలుస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. అంతే కాదు.. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి సీటు కేటాయించాలి అనే విషయంలోనూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని చిన్నితో పాటు మరో ముగ్గురిని మినహాయించి టీడీపీ తరపున పోటీ చేసే ఏ అభ్యర్థికైనా తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజాసేవకు ముందుకు వస్తానని, ధన కర్ణుడిగా పోజులిస్తున్నాడంటూ నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. నా కాంపౌండ్‌లోకి ఏ అవినీతిపరుడినీ రానివ్వను. అలాంటి వారి నుంచి దూరం పాటిస్తున్నాను అని అన్నారు. అయితే, అన్న కేశినేని నాని వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, నాని తమ్ముడు కేశినేని చిన్ని.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం.. పార్టీ కోసం శ్రమిస్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ జీవితం మాకూ.. అందరికీ ఆదర్శం అన్నారు.. కానీ, గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని మండిపడ్డారు.
Read Also: MP Kesineni: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. పార్టీలతో నాకు పని లేదు..
Also Read
- Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
- YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
ఇక, కేశినేని నాని కామెంట్లపై స్పందించిన కేశినేని చిన్ని… పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికి సహకరిస్తానని ప్రకటించారు.. టీడీపీ అధిష్టానం.. కేశినేని నానికి టికెట్ ఇచ్చినా నా మద్దతు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 2014 ఎన్నికల్లో కేశినేని నానికి తెర వెనుకుండి పని చేశాను.. గెలుపు కోసం కృషి చేశాను.. 2019 ఎన్నికల్లో నానితో విబేధాల కారణంగా పని చేయకున్నా.. పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు.. అయితే, కేశినేని నాని చేసిన కామెంట్లను నేను పట్టించుకోనని కొట్టిపారేశారు.. సేవా కాక్యక్రమాలు ఎవరు చేసినా మంచిదేనన్న ఆయన.. అన్న క్యాంటీన్లల్లో పేదలు భోజనం చేస్తారు.. కానీ, డబ్బున్న వారు భోజనం చేస్తారా..? అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లల్లో నేను భోజనం చేస్తున్నానని నేనేమన్నా చెప్పానా..? అని నిలదీశారు.. పార్టీ బలోపేతం కోసం పని చేయడం.. పేదలకు సేవ చేయడమే నాకు తెలుసని స్పష్టం చేశారు కేశినేని చిన్ని.
తాజావార్తలు
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!