విజవవాద శివారులో 2 కోట్లు విలువ చేసే స్థలం ఉంది. ఎప్పటిలానే దాని సెట్టిల్ మెంట్ దందా సందీప్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో మణికంఠ సందీప్ సెట్టిల్ మెంట్ కి అడ్డుతగిలాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒక ఒప్పందానికి రావడానికి హత్యకి రెండు రోజుల క్రితం సమావేశం అయ్యారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గత రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. దీంతో మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు.
విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంత్ కుబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం, ఇతర రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.
పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
నేడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది.