APSRTC Bus Accident: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్టాండులో ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి అక్కడే మృతిచెందగా..తీవ్ర గాయాలపాలైన ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు.. ఉదయం సర్వ సాధారణంగా నెహ్రూ బస్టాండ్ రద్దీగా ఉంటుంది.. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
Read Also: TS Nominations: నేడే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నామినేషన్లు.. దద్దరిల్లనున్న కొండగల్, కరీంనగర్..
ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉంది.. ఉదయమే ఆటోనగర్ డిపో నుంచి బయల్దేరిన ఆ ఏసీ బస్సు.. నేరుగా నెహ్రూ బస్టాండ్‌కు వచ్చింది.. గుంటూరు ప్లాట్ ఫారమ్ దగ్గర ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశాడు.. అయితే, బ్రేక్ ఫెయిల్ కావడంతో.. బస్సు ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లింది.. దీంతో.. ప్లాట్‌ఫారమ్ ఉన్న ఉన్న ఔట్ సోర్సింగ్ కండక్టర్, మరో మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడేమృతిచెందారు.. తీవ్ర గాయాలపాలైన 10 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందింది. మరికొంతమంది ప్రయాణికులకు కూగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ప్లాట్‌ఫారమ్ మీదకు బస్సు దూసుకురావడంతో.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. భయభ్రాంతులలో పరుగులు తీశారు ప్రయాణికులు.. నెహ్రూ బస్టాండ్‌లోని 12వ నంబరు ప్లాట్ ఫారమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.. నేరుగా బస్సు డిపో నుంచే వచ్చినా.. ఎలాంటి తనిఖీలు చేయకుండానే తీసుకొచ్చారా? అసలు ఏం జరిగింది.? అనే కోణంలో ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.