South Central Railway: అవసరమైన భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్‌లో పలు రైలు సర్వీసులు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.. రద్దుచేయబడిన రైళ్లలో రైలు నం. 17267/17268 కాకినాడ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రైలు నం. 07466/07467 రాజమండ్రి – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రైలు నం. 17219/17220 మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 1724 రైళు నవంబర్ 13 నుండి నవంబర్ 19 వరకు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, రైలు నం. 22702/22701 విజయవాడ – విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రెండు దిశలలో నిర్దిష్ట తేదీలలో – నవంబర్ 13, 14, 15, 17 మరియు 18 తేదీలలో రద్దు చేయబడుతుంది. రైలు నెం. 17239/17240 గుంటూరు – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రెండు దిశలలో నవంబర్ 13 నుండి నవంబర్ 19 వరకు రద్దు చేయబడుతుంది.
Read Also: Pakistan: అప్పుడు అతిగా ఆనందపడింది.. ఇప్పుడు తాలిబాన్లకు మద్దతు ఉపసంహరించుకుంది..
ఇక, దారి మళ్లించిన రైళ్లలో నవంబర్ 13న ఎర్నాకులం నుండి బయలుదేరే ట్రైన్ నెం. 22643 ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్ విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మరియు నిడదవోలు జంక్షన్ మీదుగా మళ్లించబడుతుంది. రైలు నెం. 12509 బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ నవంబర్ 15 మరియు 17 తేదీలలో బెంగళూరు నుండి బయలుదేరి విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మరియు నిడదవోలు జంక్షన్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. రైలు నెం. 11019 CST ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 13, 15, 17, 18 తేదీలలో ముంబై నుండి బయలుదేరి విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, మరియు నిడదవోలు జంక్షన్ మీదుగా మళ్లించబడుతుంది. ఈ సమయంలో ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో స్టాపేజ్‌ను తొలగిస్తారు.