విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపలో టికెట్ దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో పక్క పార్టీల్లో నుంచి అధికార వైసీపీలోకి కూడా వస్తున్నారు. అయితే, తాజాగా విజయవాడలో సంక్రాంతి పండగ రోజు ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పార్థసారథి, ఎంపీ కేశినేని నాని టార్గెట్ గా ఫ్లెక్సీల వార్ సాగుతుంది.
Heavy Traffic: ఉభయ తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ఉపాధి నిమిత్తం సొంత ఊరు వదిలి వెళ్లేవారు, ఎక్కడో ఉంటున్న వారు సంక్రాంతి పండుగకే సొంత ఊరు చేరుకుంటారు.
సందట్లో సడేమియాలాగా సంక్రాంతి షాపింగ్‌లో కిలాడీ లేడీల చేతివాటం చూపించారు. ఖంగు తినిపించే వ్యూహంతో చీరల దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతలోనే సీసీ కెమెరాల్లో చూసి నిర్వాహకులు అలెర్ట్ కాగా.. సమయ స్పూర్తితో కిలాడి లేడీలను పట్టించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విభాగాల యూనిట్ టేబుల్ క్యాలెండర్‌ను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ సుసర్ల శ్రీనివాసరావు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.