బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫెక్లీలను తొలగించారు.
ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ని కలిసి కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని…
కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్... రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది..
కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకుంది. ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం పర్యటించనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా.. వారికి విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. అనంతరం.. సీఈఓ ఎంకే మీనాతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రేపటి సమావేశం అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఈసీ బృందం మూడ్రోజుల పర్యటనలో భాగంగా.. రాజకీయ పార్టీలు,…
ముందు విజయవాడ మేయర్‌ని కలిసి కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తాను.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని కూతురు, టీడీపీ కార్పొరేటర్ కేశినేని శ్వేత..