విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు.
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 18 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసి అందులో 206 అడుగులున్న అంబేడ్కర్ మహాశిల్పాన్ని సీఎం ఆవిష్కరించారు.
సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని సీఎం వెల్లడించారు.
AP Ministers: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ మంత్రులు ప్రసంగించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏదైనా గ్రాఫిక్సేనని.. ఇది చారిత్రాత్మకమైన ఘట్టం అంటూ మంత్రి వెల్లడించారు. జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ ముఖం…
రేపు విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ ఉండటంతో పాటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వాహనాల ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి తెలిపారు.
రేపు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహా విష్కరణకు అందరూ హాజరు కావాలి అని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారు అని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు.