MP Vijay Sai Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతోనే అంబేద్కర్ అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. విజయవాలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం అవుతోన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి పరిశీలించారు.. 19వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న స్మృతివనంలో ఏర్పాట్లను పరిశీలించి.. కొన్ని సూచనల చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
రాజ్యాంగ కర్తగా బీఆర్ అంబేద్కర్ సామాజిక అభివృద్ధికి తగినట్టుగా రాజ్యాంగం రూపొందించారు.. సీఎం వైఎస్ జగన్‌కు అంబేద్కర్ పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం చేశారని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం జగన్.. నవరత్నాలు రూపొందించారని పేర్కొన్నారు. చరిత్రలో ఈ మహాశిల్పం నిలిచిపోతుందన్నారు. లక్షా ఇరవై వేల మందితో కార్యక్రమంలో జరుగుతుంది.. సాయంత్రం డ్రోన్ షో నిర్వహిస్తాం అన్నారు. దార్శనికుడి కార్యక్రమానికి అందరూ తరలిరావాలి.. ఆహ్వానం అవసరమా..? అని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి.
కాగా, ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది.. స్వరాజ్ మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నేతలు, అధికారులు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.. ఏలూరు, పల్నాడు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. రాజకీయ నేతలు, దళితసంఘాలకు చెందిన నేతలు.. ఇలా పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎవరీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.