Vijayawada: విజయవాడలో భారీగా డయేరియా కేసులు.. రేపు నీటి టెస్టుల రిపోర్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Contaminated Drinking Water Problem: విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని మరణించగా.. అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ అనేక మంది హస్పటల్ పాలవుతున్నారు. బాధితుల్లో నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. కలుషిత నీరు పైప్‌లైన్లలో కలుస్తున్నా.. వీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని మండిపడుతున్నారు.
Read Also: Kalki 2898 AD: ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. భారీ మొత్తానికి ‘కల్కి 2898 ఏడీ’ పంపిణీ హక్కులు!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శుద్ధిపై కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంకులు పాకురు పట్టి ఉన్నాయని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కేవలం ఏడు అడుగుల లోతులోనే నీరు ఉండటంతో ఇంటేక్ వెల్‌లోకి మొత్తం బురద నీరు వెళ్తుంది.. ఈ నీటిని పలు దశల్లో క్లీన్ చేయాల్సింది పోయి.. అరకొర వాటర్ ట్రీట్‌మెంట్‌తో నేరుగా పంపింగ్ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. కుళాయి నీరు తాగేందుకు అవకాశం లేకపోవడంతో అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ క్యాన్లను కొంటున్నారు. ఇక, ఇతర అవసరాలకు కలుషిత నీటినే వినియోగించడంతో చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయని విజయవాడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం..ఫోటో రిలీజ్
ఇక, విజయవాడ నగరంలో కలుషితనీటి బాధితుల సంఖ్య పెరుగుతుంది. డయేరియా బారిన ప్రజలు పడుతున్నారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలు సైతం డయేరియా బాధితులలో ఉన్నారు. కాగా, ఆలస్యంగా మేల్గొన్న అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరుతో రక్తనమూనాలను సేకరిస్తున్నారు. వాటి ఫలితాలను ఇప్పటి వరకు వైద్యారోగ్య శాఖ వెల్లడించలేదు. ఇక, నీటి నమూనాల పరీక్షలు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇందులో నైట్రేట్ లు అధికంగా ఉండటమే కారణం కావచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి నీటి టెస్టుల రిపోర్టులు వస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!