Vijayawada: విజయవాడ ఇంద్రకిలాద్రిలో భక్తుల సౌకర్యం కోసం కనకదుర్గమ్మ దేవస్థానం ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టింది. సర్వదర్శనం (ఉచిత దర్శనం) క్యూలో వచ్చే భక్తులకు కూడా ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక ట్రయల్ రన్ నిర్వహించారు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రయోగాత్మక కార్యక్రమం సాగింది. New Districts In AP: మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్…
Fake TTD Letters: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్ల జారీపై విజయవాడ నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు (నవంబర్ 16న) ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై ప్రసంగించనున్నారు.
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రోడ్డు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒకటి రెండు చోట్ల ప్రమాదాలు జరగడం.. కొంతమంది మృతిచెందిన ఘటనలు వెలగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, విజయవాడ ఉయ్యూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.. విజయవాడ – మచిలీపట్నం హైవేపై ఉయ్యూరు సమీపంలోని గండిగుంట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న టాటా సఫారీ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. అందులో…
Gautam Reddy: తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చిన పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం సరికాదు అన్నారు.. ప్రశాంతంగా ఉండే నగరాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా..? అని మండిపడ్డారు.. నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి…
Gautam Reddy Car Fire: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ఉంచిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరిపోయాడు.. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఓ బ్యాగ్‌తో అక్కడికి…
Spurious Liquor Case: ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో నిందితులకు షాక్ ఇచ్చింది విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు.. నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఎక్సైజ్ కోర్టు.. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు,…
AP High Court: విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని నిందితులు హైకోర్టులో వేసిన పిటిషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరికి జీవిత ఖైదు విధింపును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు పంది వెంకట్రావును నిర్దోషిగా ధర్మాసనం ప్రకటించింది. ట్రైల్…