South Central Railway: సికింద్రాబాద్ నుంచి తక్కువ టైమ్ లో గుంటూరు, విజయవాడకు వెళ్లొచ్చు..
- తగ్గుతున్న సికింద్రాబాద్ నుంచి గుంటూరు- విజయవాడకు ప్రయాణ సమయం..
- గుంటూరుకు మూడు గంటలు- విజయవాడకు మూడున్నర గంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు. ప్రధాన నగరాల్లోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. వందే భారత్ రైళ్లను సెమీ-హై స్పీడ్ రైళ్లుగా కూడా ప్రవేశపెట్టి.. ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా చేయాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేవిధంగా చేశారు. కాగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు-సికింద్రాబాద్ మార్గం చాలా కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు వెళ్లే రైలు మార్గాలకు ఇది ప్రత్యామ్నాయం. రైళ్ల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు సింగిల్ లైన్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైన్ గా విస్తరిస్తున్నారు.
Read also: CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..
Also Read
దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతోంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల్లో, విజయవాడకు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాల్లో భూమి అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రైల్వేలైన్ సమీపంలో భూములు ఉన్నా.. మరికొన్ని అవసరం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు పశ్చిమ మండలం చినపలకలూరులో 9.463 ఎకరాలు, మేడికొండూరు మండలం సిరిపురంలో 15.809 ఎకరాలు, అదే మండలం మండపాడులో 7.35 ఎకరాలు, విశాలాలలో పది సెంట్లు, నల్లపాడులో 5.958 ఎకరాలు. అభ్యంతరాలను నెల రోజుల్లోగా గుంటూరు ఆర్డీఓకు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గుంటూరు ఆర్డీఓ కార్యాలయం కాంపిటెంట్ అథారిటీ. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్..
తాజావార్తలు
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!