Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు. ఉపాధ్యాయుల మందలింపుతో…
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 15న నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాట్లపై భువనేశ్వరి పోలీసులతో చర్చించారు.
సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్రపంచంలో అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి.. ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం క్లీన్ ఎనర్జీదే ప్రముఖ పాత్ర అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనల ద్వారా విద్యార్థులు కొత్త వాటిని కనుగొనాలని మంత్రి చెప్పుకొచ్చారు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో…
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.…
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘శ్రీ…
సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్వెజ్ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.
విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహిళా పోలీసు సిబ్బంది. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.. రెండు రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది.