ఏపీని వర్షాలు వీడటం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2 రోజుల్లో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కోనసీమ, ఎన్టీఆర్ తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే.. అల్పపీడనం ప్రభావం వల్ల…
విజయవాడ వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. చీపురు చేత పట్టి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు నారాయణ. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసి యజమానులకు అప్పగించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు…
విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే బుడమేరు వరద ముంపుతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్‌లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని, వారికి అవసరమైన…
ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు , వరదల కారణంగా వారి సంఖ్య 32కి పెరిగిందని, సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య 45,369కి పెరిగిందని అధికారులు తెలిపారు. విజయవాడలో అత్యధికంగా ప్రభావితమైన ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మరణించారు; గుంటూరు (ఏడు), పల్నాడు (ఒకటి) అధికారికంగా విడుదలయ్యాయి. వరద బీభత్సానికి గురైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను గురువారం కేంద్ర ప్రభుత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందం సందర్శించి బాధితులతో సంభాషించనుంది. కేంద్ర బృందంలో…
వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసింది పురపాలక శాఖ.. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు.. ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం..
బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చే వరకు తాను అక్కడ నుంచి కదిలేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కాలువకు మూడు ప్రాంతాలలో గండి పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఆయన పేర్కొన్నారు.
బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని అక్కడి పంపిస్తున్నారు లోకేష్. ఇక, బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు..
బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..