బెజవాడలో వరద తగ్గుముఖం పడుతోంది. బుడమేరు గండ్లు పూడ్చటంతో నగరంలో బుడమేరు వరద ఆగింది. బుడమేరు గండ్లు పూర్తిస్థాయిలో పూడ్చివేయడంతో పలు ప్రాంతాలు ముంపు నుంచి బయటపడుతున్నాయి. విజయవాడలోని కేఎల్ రావు నగర్, సాయిరాం సెంటర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచింది.
ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు.
విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు సృష్టించిన నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపింది.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టంపై అంచనా వేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేస్తామని తెలిపారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా.. అయితే, ఈ సమయంలో బాధితులు ఇళ్లలో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు..
విజయవాడ సహా ఏపీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. ఇక, కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మరోవైపు.. ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.
వరద బాధితులకు వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక అందచేస్తాం.. నష్టం అంచనాలపై నివేదిక రేపు పంపనున్నట్టు వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏరియల్ సర్వే చేశాను.. కొల్లేరు సరస్సు, బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతం చూశాను.. బుడమేరు గండ్లు పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ రోజు రాత్రి కల్లా బుడమేరు గండ్లు పూడుస్తామని వెల్లడించారు.. ఆర్మీ వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి…
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జగనే రాష్ర్టానికి ఒక పెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన.. జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయన్నారు. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు
బుడమేరు వరద నీటిలో చిక్కుకుని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడవాసులు. మరోపక్క దొంగలతో భయంతో వణుకుపోతున్నాం అంటున్నారు.. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో బెదిరిస్తున్నారు.. ఉన్నకాడికి దోచుకుంటున్నారు.. ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, దొంగలు బారి నుండి మమ్మల్ని పోలీసులే రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ముత్యాలంపాడు.. శ్రీనగర్ కాలనీలో మూడు బైకులు చోరీకి గురైనట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. దొంగలు బారి నుండి…