విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు..
ఏపీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అయితే.. విజయవాడలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో రెండు రోజులు విజయవాడలోనే సీఎం చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు…
విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీఇన్ని కావు. చుట్టూ వరద నీరు ముంచేత్తిన అవసరాల కోసం చుక్క మంచినీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. సితార ప్రాంతంలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరకడంతో భావి వద్దకి బాధితులు క్యూ కడుతున్నారు. వరద నీటిలో కష్టాలు పడుతూ బిందెలు బకెట్లు టిన్నులతో నీళ్లను తోడుకుని వెళ్తున్నారు. బిందె నీటి కోసం దూర ప్రాంతాల నుంచి బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. విజయవాడ వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ఒక్కొక్కరికి కష్టాలు…
Vijayawada Floods : బుడమేరు కాలువ, కృష్ణానది కారణంగా విజయవాడలో వరదలు ఎన్నడూ లేనంతగా అజిత్ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్న, పాయకాపురం, ప్రస్తుతం రామలింగేశ్వరనగర్, భవానీ పురంలపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఈ ప్రాంతాలు నీట మునిగాయి, వేలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణానది నుంచి వరదనీరు ప్రవహించడంతో రామలింగేశ్వరనగర్‌లోని ఇళ్లలోకి ప్రహరీ గోడలు విరిగిపడ్డాయి. ఆరు అడుగుల మేర నీరు చేరడంతో పోలీస్ కాలనీతోపాటు చుట్టుపక్కల రోడ్లపైకి నీరు చేరింది.…
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో... గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి.
కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు, వరదలు చూస్తున్న బెజవాడ వాసులు ఇప్పుడు తమ వస్తువులను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.. లక్షలు పోసి కొనుగోలు చేసిన కార్లను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిపోయింది.. ఇప్పటికే వందలాది కార్లు.. ఇతర వాహనాలు నీటమునిగి పోగా.. మిగతా వారు తమ కార్లను, వాహనానుల కాపాడుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.. అయితే, ఇప్పుడు బెజవాడ వాసులకు దుర్గగుడి ఫ్లైఓవర్ పార్కింగ్ స్పాట్‌గా మారిపోయింది..
కృష్ణానది వరద 12 లక్షల క్యూసెక్కులు చేరుతుందనే అంచనా నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డలకు ముప్పు వంచిఉన్న నేపథ్యంలో.. పెరుగుతున్న వరద దెబ్బకి వణికిపోతున్నారు జిల్లా వాసులు.
విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.
Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. ఈ అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నది. పోటు మీదుంటే వరదని తనలోకి సముద్ర ఇముడ్చుకోదు.. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం మొదలైంది.