Railway Minister Ashwini Vaishnaw: రైళ్లలో అందుబాటులో అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్, ఆక్సిజన్ సిలిండర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Minister Ashwini Vaishnaw: రైళ్లలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.. కేంద్రం.. రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
Read Also: Jagga Reddy: నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే..!
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు రాజ్యసభలో వెల్లడించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్ .అన్ని ప్రయాణీకుల రైళ్ళతోపాటు రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని, రైల్వే సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్‌లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసిందన్నారు. ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!