విశాఖ భూములపై ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను….సీబీఐ, ఈడీ, ఎఫ్.బి.ఐ., విచారణకు సిద్ధంగా ఉన్నా అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నేను ఇప్పటి వరకు వ్యాపారం చెయ్యలేదు…..నేను మీడియా రంగంలోకి వస్తున్నాను….నేనే ఛానల్ ప్రారంభిస్తా అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నాకు విశాఖలో ఒకే ఒక ఫ్లాట్ ఉంది….అంతకు మించి నాకు ఆస్తులు లేవు. నా కుమార్తె అత్తింటి కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపార రంగంలో వున్నారు.. నా వియ్యంకుడు కుటుంబం ఆస్తులు కొనుగోలు చేస్తే నాకేం సంబంధం అన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.
Read Also: Viral Video: బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న ఏనుగు.. స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్లు
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారు…వైసీపీపై దురుద్దేశంతో దుష్ప్రచారం జరుగుతోంది…..వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను అడ్డుకోవడం…..అమరావతి భూములతో లక్షల కోట్లు సంపాదించాలనే కుట్రలో భాగమే….కొన్ని పత్రికలు వార్తలను కులం అనే పచ్చ ఇంకుతో రాస్తున్నాయి….విషపు రాతలు రాసే మీడియాకు వైసీపీ ఏమి చేసిన తప్పుగానే కనిపిస్తుంది….దసపల్లా భూములపై ఇప్పటికే బిల్డర్లు విస్పష్టంగానే చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే దసపల్ల భూములు 22(ఏ)నుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. విశాఖలో భూములు అన్నీ ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉన్నాయి. దసపల్లాపై చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోవడం చంద్రబాబు వైఫల్యం అన్నారు.నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు 5 వేల కోట్లు విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించాను. నేను ఇప్పటికీ వైజాగ్ జిల్లాకు చెందిన ఎంపీనే. నేను అనుకుంటే ఇప్పటికైనా చేయగలను….హయగ్రీవా భూముల్లో నిబంధనలకు విరుద్ధం అని తేలితే చర్యలు తప్పవన్నారు విజయసాయిరెడ్డి.
Read Also: Amaravati Maha Padayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలని వైసీపీ నినాదాలు