ఇళయదళపతి విజయ్ 65వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “బీస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 21న విజయ్ పుట్టినరోజు సందర్భంగా “బీస్ట్” టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ లను కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ కు విజయ్ అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యోగిబాబు, షైన్ టామ్ చాకో, విటివి గణేష్, అపర్ణ దాస్…
(జూన్ 22న విజయ్ బర్త్ డే)ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. తెలుగేతరుల కళలను అభిమానించి, ఆరాధించడంలోనూ మనవారు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి…
ఇళయ దళపతి విజయ్ బర్త్ డే జూన్ 22న. అయితే ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆయన సీడీపీలతో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన అప్డేట్…
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే లక్షలు. తరువాత కోట్లు. ఇప్పుడు వందల కోట్లు! మన సినిమాల్లో క్వాలిటీ, క్రియేటివిటి కోసం దర్శకనిర్మాతలు ఎంత వెచ్చిస్తారన్నది పక్కన పెడితే… రెమ్యూనరేషన్స్ కోసం బాగానే డబ్బులు వెదజల్లుతారు! లెటెస్ట్ గా దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా గురించి అటువంటిదే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ విషయం…
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో సరికొత్త కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని క్రాంతి సైనా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు.…
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళస్టార్ హీరో విజయ్ మాస్టర్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ బరిలో మాత్రం ఆ మూవీ విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత విజయ్ ఏ సినిమాలో చేస్తాడనే దానిపై వచ్చిన రకరకాల సందేహాలకు తెర దించుతూ, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ మూవీ చేయబోతున్నాడని అధికారిక వార్త వచ్చింది. విజయ్ 65వ చిత్రమైన దీనిలో అతనితో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విశేషం…
తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది అనే వార్త గతకొంతకాలంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంశీ తన కథను స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని, విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లు, కథలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్…
తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నాడన్న విషయం తెలిసిందే. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల వంశీ విజయ్ ని కలిసి కథ విన్పించగా… లైన్ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడట. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారట. అదే నిజమైతే విజయ్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మహేష్ బాబు,…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం.