కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం తన తదుపరి డార్క్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్ 66వ చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. విజయ్ ఫస్ట్ డైరెక్ట్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇది 50వ చిత్రం కాగా, వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రారంభించనున్నారు. అయితే ఈ ద్విభాషా చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్నారు. కాబట్టి ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండేను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
Read Also : ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?
అనన్య ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టిలో పడింది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 2న అరెస్ట్ కాగా ఈ కేసులో ఆర్యన్, అనన్య మధ్య డ్రగ్స్ సంబంధిత చాట్‌లను ఎన్‌సిబి గుర్తించింది. ఆ తర్వాత అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసి, ఆమెను ఎన్‌సిబి కార్యాలయంలో విచారణ కోసం పిలిచారు. దీంతో ఈ ఎఫెక్ట్ అనన్య నెక్స్ట్ మూవీపై పడిందని అంటున్నారు. ‘తలపతి 66’ ప్రాజెక్ట్ నుండి అనన్యను తొలగించారంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నిజం ఏమిటంటే అసలు ఈ ప్రాజెక్ట్ అనన్య దగ్గరకు వెళ్లనే లేదట. ఆమెను అసలు ఎవరూ, ఎలాంటి పాత్ర కోసం సంప్రదించలేదట. ప్రస్తుతం అనన్య విజయ్ దేవరకొండతో కలిసి “లైగర్” చిత్రంలో కనిపించనుంది.