తలపతి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. అన్ని పన్నులు, ఛార్జీలను చెల్లించాడు. కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుండి మాత్రం మినహాయింపుని కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపుకు సంబంధించిన కేసు తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉంది.
Read Also : నాని నెక్స్ట్ మూవీ “దసరా”… పండగేనా ?
కొన్ని నెలల క్రితం ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణ్యం ప్రవేశ పన్ను మినహాయింపు కోరినందుకు ఈ హీరోపై ఫైర్ అయ్యారు. ట్యాక్స్ కట్టాల్సిందేనని తేల్చారు. న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విజయ్ మళ్ళీ పైకోర్టులో అప్పీల్ చేశాడు. అక్కడ కూడా విజయ్ కు చుక్కెదురైంది. తాజాగా బెంచ్ కోర్టు తదుపరి ఆదేశాలపై విజయ్ మొత్తం పన్ను మొత్తాన్ని చెల్లించాడు. ఈ మేరకు నిన్న తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు విజయ్ పన్ను కట్టినట్టు వెల్లడించింది. ఈ కేసును కోర్టు మరోమారు వాయిదా వేసినట్టు సమాచారం.