Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ నేతృత్వంలో జరిగిన మెగా రాజకీయ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కనీసం 31 మంది మరణించారని సమాచారం. హాజరైన వారిలో చాలా మంది కుప్పకూలిపోయారని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించారు. "పోలీసులు, దయచేసి సహాయం చేయండి"…