కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి…
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిచ్చగాడు చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ సంపాదించారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. విజయ్ సినిమాలకు టాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా తెలుగు చిత్ర పంపిణీదారులు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి…