టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24…
Sanju Samson: ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కి టీమిండియా ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. అంతేకాక, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో సమావేశం నిర్వహించి జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం సంజూ శాంసన్‌కి ఇబ్బంది కలిగించింది.…
Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన రౌండ్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో…
ఇంద్రజిత్ పోరాడినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో తమిళనాడు లక్ష్య ఛేదనలో 230 రన్స్ కు ఆలౌటైంది. దీంతో 64 పరుగుల తేడాతో హర్యానా విజయం సాధించింది.
Vijay Hazare Trophy: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరో సెంచరీ సాధించాడు. అయినా మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో ఆ జట్టుపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. షెల్డన్ జాక్సన్ అద్భుత సెంచరీ చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత…
Ruturaj Gaikwad: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సైతం బద్దలు కొట్టాడు. యువరాజ్ కేవలం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే రుతురాజ్ మాత్రం 7 బంతుల్లో ఏడు సిక్సర్లు బాదాడు. మధ్యలో ఓ నోబాల్ పడటంతో ఒకే ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లో…
Vijay Hazare 2022: విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు చేసిన జగదీశన్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేయడంతో లిస్ట్ A క్రికెట్లో అత్యధిక పరుగులు…
విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో…