పుదుచ్చేరి కేంద్రంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి పబ్లిక్ మీటింగ్‌లోకి వస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే అధినేత విజయ్ తొలిసారి పబ్లిక్‌లోకి వస్తున్నారు. మంగళవారం రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈసారి తమిళనాడు కాకుండా వేదిక పుదుచ్చేరికి మారింది.