సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న నయనతార పూజ అనంతరం ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ…
లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్న విషయం తెలిసిందే.. ఈమధ్య కాలంలో పబ్లిక్ లో బాహాటంగానే తిరుగుతున్నారు. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, విఘ్నేశ్ శివన్ తన ప్రియురాలు నయన్ ఇంట్లో ప్రత్యేక్షమైయ్యాడు. నయన్ తల్లి ఓమన కురియన్ పుట్టిన రోజు సందర్బంగా విఘ్నేశ్ ఆమె ఇంటికి విచ్చేశారు. చెన్నై నుండి వీరిద్దరూ కలిసి కేరళ వెళ్లారు. అక్కడ సరదాగా అమ్మ…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని…
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా ప్రకటించి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోమారు ఆమె ఓ బేబీని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఉండగా, నయన్ బేబీని ఎత్తుకుంది. దాంతో అసలు ఆ బేబి ఎవరు అనే ప్రశ్న అభిమానులను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె అభిమానులు ఈ బేబీ ఎవరై ఉంటారబ్బా !? అనే…
అక్కినేని సమంత, నయనతార మరియు విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘కాతువాకుల రెండు కాదల్’.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ప్రస్తుతం సామ్, నయన్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన షూటింగ్ వీడియో వైరల్ గా మారింది. బస్సు ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు ఫుట్‌బోర్డ్ పై నిలబడ్డారు. తెల్ల చీరలో హీరోయిన్స్ కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి వైట్…
లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం…
దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. కొంతకాలం క్రితం ఈ లవ్ బర్డ్స్ తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న తమిళ చిత్రం “కూజంగల్” నిర్మాణ, పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో “ఐఎఫ్ఎఫ్ఆర్ – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్”లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో “కూజంగల్” చిత్రం ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డును దక్కించుకుంది. “కూజంగల్” సినిమాకు పిఎస్…
సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్‌లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో…
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం “నేత్రికన్”. ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, సరన్, ఇంధుజా, మణికందన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రౌడీ పిక్చర్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. ‘అవల్’ ఫేమ్ గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించగా, కెమెరామ్యాన్ గా ఆర్డీ రాజశేఖర్ చేశారు. ఎడిటర్‌గా లారెన్స్ కిషోర్, యాక్షన్ డైరెక్టర్‌గా ధీలిప్ సుబ్బారాయణ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎస్ కమల్‌నాథన్ ఈ చిత్ర సాంకేతిక సిబ్బందిలో ఒక…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విగ్నేష్. అందులో భాగంగా అభిమానులు అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు. తాజాగా జరిగిన చాట్ సెషన్…