మొదటి అంతర్జాతీయ అవార్డు అందుకున్న నయన్, విగ్నేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. కొంతకాలం క్రితం ఈ లవ్ బర్డ్స్ తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న తమిళ చిత్రం “కూజంగల్” నిర్మాణ, పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో “ఐఎఫ్ఎఫ్ఆర్ – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్”లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో “కూజంగల్” చిత్రం ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డును దక్కించుకుంది. “కూజంగల్” సినిమాకు పిఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దర్శకుడి కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.
Read Also : ప్రభాస్ “సలార్”లో విలన్ అతనేనా ?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ నిన్న సోషల్ మీడియాలో నయనతార టైగర్ అవార్డును పట్టుకుని ఉన్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. “మా మొదటి అంతర్జాతీయ పురస్కారం… “కూజంగల్” మాకు ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును రోటర్‌డామ్ నుండి చెన్నైలో ఉన్న ఇంటికి తీసుకువచ్చింది. ఈ రత్నాన్ని తయారు చేసిన దర్శకుడు పిఎస్ వినోద్ రాజ్, చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఈ చిత్రం ప్రశంసలు పొందడం మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది!” అంటూ పోస్ట్ చేశారు. ఇక నయన్, విఘ్నేష్ ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్” సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు