అక్కినేని సమంత, నయనతార మరియు విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘కాతువాకుల రెండు కాదల్’.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ప్రస్తుతం సామ్, నయన్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన షూటింగ్ వీడియో వైరల్ గా మారింది. బస్సు ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు ఫుట్‌బోర్డ్ పై నిలబడ్డారు. తెల్ల చీరలో హీరోయిన్స్ కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి వైట్ షర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకున్న యూనిట్ సభ్యులు.. ఇటీవలే పుదుచ్చేరిలో షూటింగ్ ను ప్రారంభించారు.
Kaathuvaakula Rendu Kaadhal shoot.
— Selva (@seldicap17) August 23, 2021
Vignesh Shivan aa nambalamaa? pic.twitter.com/DUtgvgyBwZ