సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలని భారత ఉప రాష్త్రాతి వెంకయ్య నాయుడు సూచించారు. నేడు సిరివెన్నెల సీతారామశాస్ర్తి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” సిరి వెన్నెల రాసిన ప్రతి పాట, మాటలో సందేశం ఉంటుంది. సిరి వెన్నెలతో నాకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆయన గురువు సత్యరావు మాస్టారు మా స్నేహితుడు.. ఇప్పుడు సిరి వెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను సినిమా పాటల పుస్తకం ఆవిష్కరించడంపై కొంత మంది ఆశ్చర్యపోయారు. ఎందరో మహానీయులు తెలుగు సినిమా పాటలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారుసినిమా పాటను ఆర్థికంగా కాకుండా అర్థవంతంగా కొలవడంలో సిరి వెన్నెల అగ్రగణ్యులు.. మనిషికి సంగీతం, సాహిత్యం సాంత్వన కలిగిస్తుంది.
సినిమా వినోదాన్ని పంచడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా పంచేవిగా ఉండాలి. మాయాబజార్ లాంటి సినిమాలు 100 రోజులు ఆడితే.. ఇప్పటి సినిమాలు ఫస్ట్ షో ఉంటుందా? లేదో కూడా తెలియదు పరిస్థితి ఉంది. వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లుగా సినిమాలు ఉంటున్నాయి. ముఖ్యంగా సినిమాలో శృంగారం అంటే అశ్లీలంగా ఉండకూడదు.. సినిమాలో డబుల్ మీనింగ్ కంటే అసలు మీనింగ్ ఏంటో చెప్పాలి. సినిమా, ప్రేక్షకుడికి సంస్కారాన్ని నేర్పించాలి. కొన్ని సినిమాలకు వెళ్తే ఎందుకు వచ్చాంరా బాబో అనిపిస్తుంది. సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలని” సూచించారు.