రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. రాహుల్ తో సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటూ ఇతర…
ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో.. ప్రక్షాళన ప్రారంభించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ… ఈ పరిణమాలపై ఢిల్లీలో స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. సోనియా గాంధీ ప్రక్షాళన ప్రారంభించారు.. ఆమెకు నా అభినందనలు.. ఇది శుభసూచకం అన్నారు.. రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా సమావేశం అవుతున్నారు… తెలంగాణలోని పరిణామాలను కూడా సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికల గురించి ఈమధ్యే తన జోస్యం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. తాజాగా ఆయనకు కోపం వచ్చింది. సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చిన కౌంటర్లకు ఎదురు దాడికి దిగారు. ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు టీపీసీసీ చీఫ్. చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీహార్ ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన కామెంట్స్‌కి వీహెచ్, మధు యాష్కీ కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే ఐదుగురు ఐఏఎస్…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఆయన.. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వల్లనే రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇలా అయితే, పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..? అని నిలదీశారు.. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లను కూడా పక్కన పెడుతున్నాడని విమర్శించిన వీహెచ్… ఈ విషయాలను అధిష్టానానికి చెబుతాం అంటే అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే…
నేను మేడం సోనియాకు లేఖ రాసిన క్షణం నుండి కాంగ్రెస్ గుంపులో నేను లేను అంటూ సంచలనం రేపారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాపై కోవర్ట్ అనే నింద వేశారు. ఉద్దేశ పూర్వకంగా ఇలా నిందలు వేస్తున్నారు. నేను భరిస్తూ వుండాలా? తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని విపులంగా వెల్లడిస్తూ.. ఒక లేఖను ఏఐసీసీకి పంపారు. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు ఆప్షన్లకు అవకాశం ఉంది. కాంగ్రెస్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు.. కొన్ని సందర్భాల్లో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నా.. వారి మధ్య మనస్పర్దలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నమాటలు.. అయితే, తాజాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రేవంత్, కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఇద్దరూ రెడ్లు…
మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అవినీతి దేశంలో ఎక్కడ లేదని జేపీ నడ్డా చెబుతున్నారు.. మరీ, ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు. Read Also: కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..! ఢిల్లీ నుంచి తెలంగాణకు…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.. అధికార టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనంటున్నారు.. అయితే, బీజేపీకి అంత సీనేలేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. Read Also: ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఆరిపోయే దీపం..! బీజేపీకి 80 సీట్లు కాదు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్‌రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత,…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని లేఖలో సీజేఐని కోరారు వీహెచ్… లోయర్ కోర్టు తీర్పు ఇచ్చినా.. హైకోర్టులో ఏడాదిన్నరగా కేసు పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హజీపూర్ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం…