పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్”తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. గత కొంతకాలంగా ఈ స్టార్ డైరెక్టర్ “ఐకాన్”ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ముందుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” తరువాత ఈ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా భారీ పరాజయాన్ని చవి చూడడంతో అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కాస్త సరదాగా ఉండే…