పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్”తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. గత కొంతకాలంగా ఈ స్టార్ డైరెక్టర్ “ఐకాన్”ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ముందుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” తరువాత ఈ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా భారీ పరాజయాన్ని చవి చూడడంతో అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కాస్త సరదాగా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాడు. అలా అల్లు అర్జున్ “అల వైకుంఠపురంలో”, “పుష్ప” వైపు మొగ్గు చూపాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ మూలన పడింది. అయితే ‘పుష్ప’ తర్వాత బన్నీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వేణు శ్రీరామ్ డైలమాలో పడ్డాడు. “ఐకాన్” కోసం చాలా కాలం ఎదురు చూసిన ఈ స్టార్ డైరెక్టర్ కొత్త హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడు.
Read Also : Pawan Kalyan : ఖరీదైన ప్లాట్ కొన్న పవర్ స్టార్ ?
తాజా సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ని ఖరారు చేసాడు. రామ్ ప్రస్తుతం ఈ చిత్రం ఇమేజ్ మేకోవర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ హీరోకు కూడా ఇప్పుడు మాస్ కమర్షియల్ హీరో ట్యాగ్ కావాలి. అందుకే ప్రస్తుతం లింగుసామితో కలిసి ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడు. మరోవైపు రామ్ ఇటీవల మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా వేణు శ్రీరామ్ “ఐకాన్”ని రామ్‌కి వివరించగా సానుకూల స్పందన వచ్చిందట. మరి మేకర్స్ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.