‘నాట్యం’ గీతం ‘స్వర్ణ కమలం’ను గుర్తు చేసిందన్న వెంకీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాట్యం అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. అలానే నందమూరి బాలకృష్ణ ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ‘నమః శివాయ’ను రిలీజ్ చేశారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా చిత్ర బృందం రెండో పాట ‘పోనీ పోనీ’ని విడుదల చేయించింది.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ”’నాట్యం’ సినిమా నుంచి ఈ ‘పోనీ పోనీ’ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి దీనిని రూపొందించారు. చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే ‘స్వర్ణ కమలం’ మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
Also Read
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
Read Also : ఆకట్టుకుంటున్న ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లి లుక్
సంధ్యారాజు మాట్లాడుతూ, ”ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా మూవీలో చాలా ముఖ్యమైన ఎమోషనల్ సాంగ్. ‘స్వర్ణ కమలం’ మూవీ చూసి చూసి ఆ టేప్ అరిగిపోయి ఉంటుంది. ఈ సినిమాలో భాగమవడం ఓ ఆశీర్వాదంలా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో భానుప్రియ గారు నా తల్లి పాత్రలో నటించారు. అలాగే ముఖ్యమైన సాంగ్ వెంకటేష్ లాంచ్ చేశారు. ఇవి నా జీవితంలో ఎప్పటికీ మరవలేని క్షణాలు” అని చెప్పారు. డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. ”ఈ మూవీ చేయడానికి ‘స్వర్ణ కమలం’ నన్ను ఇన్స్పైర్ చేసింది. టాలీవుడ్‌లో వెంకటేశ్ గారు గ్రేట్ యాక్టర్. ఎమోషన్, కామెడీ, ఫైట్స్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా ఆయన లీనమైపోతారు. మా కాలేజీలో ఒక్కొక్కరూ ఒక్కో హీరోకు ఫ్యాన్. కానీ వెంకటేశ్ గారి సినిమా విడుదలైందంటే మేమంతా కలిసి వెళ్లే సినిమా అదే అవుతుంది” అని అన్నారు. ఈ సంగీత ప్రధాన చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 22న ‘నాట్యం’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!