ఇటీవల “నారప్ప” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. “నారప్ప” నేరుగా ఓటిటిలో విడుదల కాగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం “దృశ్యం 2” ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న”దృశ్యం 2″లో వెంకటేష్ భార్యగా మీనా నటిస్తుండగా, కృతిక, ఎస్తేర్ అనిల్ వారి కూతుర్లుగా కనిపించనున్నారు. మొదటి భాగం “దృశ్యం” బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావడంతో చాలా మంది “దృశ్యం 2” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ
జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. చిత్రానికి దానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఒక సినిమా ‘యూ’ సర్టిఫికెట్ రావడం విశేషం. తెలుగులో ఈ డ్రామా థ్రిల్లర్ కోసం మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అప్డేట్ ను వాయిదా వేసింది.