Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్ అని చెప్పారు. 565 సంస్థానాల రాజులతో మాట్లాడి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత పటేల్‌దన్నారు. నాడు బ్రిటిష్ కుతంత్రాలలో కూరుకుపోయిన వ్యక్తి నిజాం అని తెలిపారు. హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యాంగ ప్రకటిస్తానని నిజాం ప్రకటించారన్నారు.
READ MORE: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు
నాడు లొంగిపోవాలని నిజాంకు పటేల్ 48 గంటల సమయం ఇచ్చారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. “ఆపరేషన్ పోలోతో నిజాం నడ్డి విరిచి, హైదరాబాద్ ను భారత్ లో కలిపిన ఘనత పటేల్‌ది.. దేశం ఐక్యతతో ముందుకు సాగాలి.. దేశ ఐక్యతే పటేల్ కు మనమిచ్చే అతి పెద్ద గౌరవం.. దేశ యువత పటేల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. మొంథా తుఫాన్ లో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తున్నాను.. నష్టపోయిన బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవాలి..” అని వెంకయ్యా నాయుడు కోరారు.
READ MORE: DGP Shivadhar Reddy: మహిళలు, పిల్లలకు రక్షణగా భరోసా సెంటర్‌లు