వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విసిరిన సవాలును టీడీపీ స్వీకరించింది. ఆర్యవైశ్యులకు ఎవరేం చేశారోననే దానిపై వచ్చే నెల 3వ తేదీన చర్చకు రావాలని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి తాము సిద్దమని, డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రావాలని సవాల్ స్వీకరించారు. ‘దమ్ముంటే వెలంపల్లి శ్రీనివాసరావు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ వెలంపల్లి సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా మాజీమంత్రి వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన…