తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు. ‘జగపతి’ బ్యానర్ కు జనం మదిలో ఓ తరిగిపోని స్థానం సంపాదించారు. తన చిత్రాలలో పాటలకు పెద్ద పీట వేసేవారు రాజేంద్రప్రసాద్. తరువాతి రోజుల్లో తన సినిమాల్లోని పాటలను కలిపి, కాసింత వ్యాఖ్యానం జోడించి, ‘చిటపటచినుకులు’ అనే మకుటంతో రెండు…