ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా.. కోర్టు డిస్మిస్ చేయటంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఈ ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్, ముందస్తు బెయిల్ పిటిషన్లు రెండు ఒకేసారి నిందితులు దాఖలు చేయటం చర్చగా మారింది. 2 పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్.
గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి వివరాలను సీఐడీ తీసుకుంటోంది.
వాట్సాప్ ఇప్పుడు అందరికీ చేరువ అయింది. వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా అవతలి వ్యక్తులకు చేరుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సందర్భం ఇది. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌తో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్…
వరంగల్ లో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడీల కుమార్ మాట్లాడుతూ… మా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. గత మార్చి 22న కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. గత బడ్జెట్లో మాకు 500 కోట్ల నిధులు కేటాయించారు, కరోనా కారణంగా విడుదల నిధులు విడుదల కాలేదు. కొందరు సభ్యులు స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం…