ఎఫ్2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్)కి సీక్వెల్‌గా ఎఫ్3 సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! దాదాపు ఆ సినిమాలో ఉన్న కాస్టింగే, ఇందులోనూ ఉంది. అదనపు ఆకర్షణగా సునీల్‌తో పాటు సోనాల్ చౌహాన్‌కి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నాడు. తొలి సినిమా కన్నా ఈ సీక్వెల్‌తో మరిన్ని నవ్వులు పూయించాలన్న అనిల్ పూనుకోవడమే కాదు, ఇది కచ్ఛితంగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు కూడా! దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో, చిత్రబృందం…
టాలీవుడ్ లో సీక్వెల్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఒక వేళ వచ్చినా ఒక్క హీరో తప్ప మిగిలిన వారందరు కొత్తవాళ్లు ఉంటారు.. కథ మొత్తం మారిపోతుంది. ఒక్క సీక్వెల్ అన్న పేరు తప్ప పార్ట్ 1 కు పార్ట్ 2 కు సంబంధమే ఉండదు. అయితే ఇలాంటివేమి ‘ఎఫ్ 3’ కి వర్తించవు అంటున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా ‘ఎఫ్ 2’ ను తెరకెక్కించి ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టాడు…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ నుంచి మరో సాంగ్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘ఊ .. ఆ .. అహ అహ’ అంటూ ఈ పాట సాగుతుంది. నీ కోర మీసం చూస్తుంటే.. నువ్వుట్టా తిప్పేస్తుంటే.. అంటూ సాంగ్ ప్రారంభంలో లిరిక్స్ వినిపిస్తున్నాయి. మంచి రొమాంటిక్‌గా కనిపిస్తున్న ఈ పాటను వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలపై చిత్రీకరించారు. ఈ పాటను కాసర్ల శ్యామ్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గని”. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న “గని” ఆహాలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘గని’ గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు OTT చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారట.…
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా F3 Movie నుంచి సెకండ్ సింగిల్ కు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. ఈ సమ్మర్ సోగ్గాళ్ళ రాక కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి…
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మే 27న “ఎఫ్3” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 22న…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “గని” ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ కూడా అంగీకరించారు. ఓ లేఖ ద్వారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, కానీ వారిని అలరించడానికి మరింత కష్టపడతానని హామీ ఇచ్చారు. ఇక తాజా అప్డేట్ ఏమిటంటే “గని” సినిమా ఓటిటి విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది.…
పూజా హెగ్డే గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇక పాన్ ఇండియా మూవీ అంటే మాత్రం పూజాహెగ్డే వైపే చూస్తున్నారు అగ్ర దర్శకనిర్మాతలు, హీరోలంతా! స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ అందరికీ లక్కీ ఛార్మ్‌గా మారిన ఈ బ్యూటీ మరోమారు ఐటెం సాంగ్ లో మెరవబోతోంది. సాధారణంగా నటీమణులు టాప్ పొజిషన్‌లో ఉంటే ఐటెం సాంగ్స్ చేయరు. అయితే పూజా అలాంటి రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఐటెం నంబర్స్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక బాక్సర్ గా వరుణ్ నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ఓటిటీ హక్కులను ఆహా వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా “గని” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనే రాగా, ఈ సినిమా కన్నడ వెర్షన్…