ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైసవం చేసుకుంది. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం రాణించిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు వరించింది. ఈ అవార్డుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసలైన హీరో…
ICC ODI Rankings: ఒకవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి టీమిండియా అడుగు పెట్టగా.. మరోవైపు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా టాప్ 10 బ్యాట్స్మెన్లలో నాలుగు స్థానాలను భారత ఆటగాళ్లు ఉండడం విశేషమే. ఈ ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానానికి చేరుకున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రెండు స్థానాలు దిగజారి…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పు చేసింది. హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. 14వ సారి భారత్ టాస్‌ను ఓడిపోవడం విశేషం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే…
టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన…
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. టీ20 సిరీస్‌లో అద్భుతంగా ప్రదర్శించిన 'మిస్టరీ స్పిన్నర్' వరుణ్ చక్రవర్తి.. భారత వన్డే జట్టులో చేరాడు.
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సంచలనం నమోదయ్యింది. టీమిండియా యంగ్ ఆటగాడు తిలక్ వర్మ తన కెరియర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా తిలక్ వర్మ ఈ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం తిలక్ వర్మ ఏకంగా 720 స్థానలు ఎగబాకి టి20 లలో రెండో స్థానంను దక్కించుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్…
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త…
Varun Chakravarthy: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి…
మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోవడం తనను చాలా బాధించిందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. మ్యాచ్‌ను తాము అనుకున్నవిధంగా ముగించలేకపోయామన్నాడు. ఫలితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి తర్వాత మ్యాచ్ కోసం సిద్ధమవుతా అని చెప్పాడు. ఈ మ్యాచులో బౌలింగ్ వేసి ఉండొచ్చు కానీ.. మున్ముందు ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉందని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. మూడో టీ20లో చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు. చక్రవర్తి ఐదు…
మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లను 145 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (40; 35 బంతుల్లో 1×4, 2×6) టాప్ స్కోరర్. జేమీ ఒవర్టన్ (3/24), బ్రైడన్ కార్స్ (2/28) దెబ్బకొట్టారు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (51;…