Varanasi: మోడీపై నామినేషన్ వేయనివ్వలేదన్న కమెడియన్ శ్యామ్ రంగీలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ వారణాసిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయనపై పోటీగా నామినేషన్ వేసేందుకు యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలా రెడీ అయ్యారు. అయితే ఆయనకు చుక్కెదురైంది. లోపలికి వెళ్లేందుకు ఆయనను అనుమతించలేదు.
వారణాసి నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని శ్యామ్ రంగీలా ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. మే 10వ తేదీ శుక్రవారం నుంచి వారణాసిలో నామినేషన్ వేసేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయమని, మంగళవారం కూడా తనను జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి అనుమతించలేదని ఆయన తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
వారణాసిలో నామినేషన్ వేయడానికి మంగళవారంతో గడవు ముగిసింది. చివరి రోజు వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. హ్యాట్రిక్ విజయం కోసం ఇక్కడి నుంచి మరోసారి ఆయన బరిలోకి దిగారు. మోడీకి ముందు వారణాసి నియోజకవర్గం నుంచి 14 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, బీఎస్‌పీ అభ్యర్థి అథర్ ఆలి ఇందులో ఉన్నారు.
వారణాసి నుంచి తనను నామినేషన్ వేయడానికి అనుమతించ లేదంటూ శ్యామ్ రంగీలా చేసిన పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. ప్రధాని మోడీతో సహా ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే హక్కు ఉందని, అయితే ఈ నియోజకవర్గం నుంచి ఇతర వ్యక్తులను పోటీ చేయడానికి అనుమతించడం లేదని ఆ పార్టీ ఆరోపించింది. శ్యామ్ రంగీలా అనే యూ ట్యూటర్ వారణాసి నుంచి నామినేషన్ వేయాలనుకుంటే జిల్లా యంత్రాగం నుంచి నామినేషన్ పత్రాలు పొందలేకపోయాడని, ప్రజలను చూసి మోడీ ఎందుకు భయపడుతున్నారని ఆ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారిని పోటీ చేయనీయండని వ్యాఖ్యానించారు.
वाराणसी चुनाव आयोग कार्यालय
14 मई, सुबह 9:15 बजे लगभग पहुँच गये है,
कहीं से कोई जवाब नहीं आ रहा,
लेकिन नामांकन की उम्मीद अभी भी नहीं छोड़ी है हमने pic.twitter.com/MfirxtfNZk— Shyam Rangeela (@ShyamRangeela) May 14, 2024
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!