రైల్వే అధికారుల ఘర్షణ.. ప్యాసింజర్స్‌కు తలనొప్పిగా మారింది. దాదాపు గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే సమ్మర్ కావడంతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇక్కట్లుపడ్డారు. వందే భారత్ సహా పలు రైళ్లు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయాయి. ఈ ఘటన వారణాసిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Madhya pradesh: దారుణం.. 8 మంది కుటుంబ సభ్యుల్ని చంపిన యువకుడు
స్టేషన్ మాస్టర్, ఉద్యోగి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయానికి దారితీసింది. వందేభారత్ సహా పలు రైళ్లు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయాయి. వారణాసి రైల్వే జంక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు.
ఇది కూడా చదవండి: Kadapa SP: విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
వారణాసి జంక్షన్‌లో పని చేస్తున్న ఎలక్ట్రికల్ సిగ్నల్ నిర్వాహకుడు షెహజాద్.. అక్కడి సెక్షన్ డిజిటల్ యాక్సిల్ కౌంటర్‌లోని రీసెట్ బాక్స్‌ను తెరిచేందుకు యత్నించాడు. అనుమతి లేకుండా దాన్ని తెరిచేందుకు కుదరదని స్టేషన్ మాస్టర్ వారించాడు. తొలుత వాగ్వాదంతో మొదలై.. చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో షెహజాద్ తనపై రాయితో దాడి చేశాడని, దీంతో తల, భుజానికి తీవ్ర రక్తస్రావం అయినట్లు స్టేషన్ మాస్టర్ ఆరోపించారు. కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, అందుకే రైళ్లను ఆపరేట్ చేయడం సాధ్యం కాలేదని ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. సిగ్నల్ ఆపరేటర్ మాత్రం.. స్టేషన్ మాస్టరే తనతో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించాడు. దీనిపై ముగ్గురు ఉన్నతాధికారులతో రైల్వేశాఖ దర్యాప్తు జరిపి ఓ నివేదిక రూపొందించింది.
ఇది కూడా చదవండి: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
మే 28న సాయంత్రం 7.30 గంటల సమయంలో వారణాసి రైల్వేజంక్షన్‌లో విధులు నిర్వర్తిస్తోన్న స్టేషన్‌మాస్టర్, ఎలక్ట్రిక్ సిగ్నల్ నిర్వాహకుడి మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఈ జంక్షన్ మీదుగా వెళ్లే అనేక రైళ్లపై ప్రభావం పడింది. పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, బనారస్-బక్సర్ మెమూ ప్యాసింజర్, ఎర్నాకులం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వారణాసి మెమూ ఎక్స్‌ప్రెస్, పట్నా కాశీ జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు సమీప స్టేషన్లలో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అలాంటిది గంటన్నరపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.