Bandi Sanjay: వారణాసిలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం.. తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరో విడతలో భాగంగా జూన్ ఒకటిన వారణాసిలో జరిగే ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉందని సంజయ్ అన్నారు. పోలయ్యే ఓట్లలో అత్యధిక శాతం శాతం మోడీకే పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
READ MORE: KTM Mew Colour: బైక్ రంగులు మార్చిన కెటిఎమ్ ఇండియా.. కొత్త కలర్స్ లో అందుబాటులోకి..
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
వారణాసిలో ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ అభిమానులేనని, వారంతా కచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. మోడీకి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే అత్యధిక పోలింగ్ నమోదు కావాలన్నారు. సోనార్‌పురలో మహిళా బృందంతో బండి సంజయ్ భేటీ సందర్భంగా కాశీలోని ప్రతి ఒక్క మహిళ మోడీకే ఓటు వేస్తారని బృందంలోని మహిళలు సంజయ్‌కు వివరించారు. అదే ధీమాతో కూర్చోకుండా ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మహిళలదేనని సంజయ్ వారికి సూచించారు. శ్రీరామ తారక ఆంధ్రా ఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వీవీ సుందరశాస్త్రితోనూ బండి భేటీ అయ్యారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీ, బీజేపీ నాయకులు గజానంద్ జోషి, మహేష్ బాబు, పాఠక్‌తో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన సంజయ్ ప్రధాని మోడీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేయడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!