రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.