PM Modi: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం. తదితరులకు స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
Read also: PM Modi Tour: నగరానికి చేరుకున్న ప్రధాని.. స్వాగతం పలికిన ప్రముఖులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మోడీ… మోడీ… నినాదాలతో రైల్వే స్టేషన్ మారుమోగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 10 వద్ద మోడీతో కలవనున్న బీజేపీ కార్యాలయ సిబ్బంది..బండి సంజయ్ చొరవతో మోడీని కలిసే అవకాశం ఉంది. తొలుత వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించిన మోడీ, ఒక కోచ్‌లో విద్యార్థులతో సమావేశమయ్యారు. అలాగే, సికింద్రాబాద్, తిరుపతి నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలోని మిగిలిన ఆరు రోజులలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 3 నెలల్లో రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాని పర్యటన దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
IPL 2023 : మ్యాచ్ కు ముందు ఇషాన్ కిషన్ తో ఎంఎస్ ధోని మాటామంతి