శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాఫ్ రూం తాళం పగలగొట్టి కొందరు దుండగులు పాఠశాల రికార్డులను తగలబెట్టారు. గదిలో రికార్డులు, పరీక్ష పత్రాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి చొరబడి పాఠశాల రికార్డులను ధ్వంసం చేశారు.
ఓ మహిళా డాక్టర్ ఆస్పత్రిలోనే అత్యంత క్రూరంగా.. దారుణాతి దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఈ ఘటన దేశ ప్రజల గుండెలను కలిచివేసింది. ఆమె పోస్టుమార్టం రిపోర్టును బట్టి ఎంత హింసాత్మకంగా హత్యాచారానికి గురైందో అర్ధమవుతుంది. మానవత్వం ఉన్న మనుషులంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.