ఆ మున్సిపాలిటీలో ఒకరి వెంట ఒకరు సరెండర్ అవుతున్నారా? మాట వినని వారికి అదే పనిష్మెంటా? కావాలని తీసుకొచ్చినవాళ్లే.. తిరుగు టాపా కట్టించేస్తున్నారా? దీంతో అక్కడికి రావడానికి అధికారులు, ఉద్యోగులు జంకే పరిస్థితి ఉందా? మాట వినకపోతే కౌన్సిల్‌లో తీర్మానం చేసి సరెండర్ చేస్తున్నారా?ఈ మధ్య కాలంలో కొత్తగూడెం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా ఉంటున్నాయి. వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత అక్కడ చీమ చిటుక్కుమన్నా అటెన్షన్ వచ్చేస్తోంది. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ వంతు వచ్చింది. పురపాలక…
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది. Read Also: గాంధీ ఆస్పత్రికి…
పాల్వంచ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. . ఈ కేసులో ఏ-2 గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కాగా తాజాగా ఈ కేసులో ఏ-2, ఏ-4 గా రామకృష్ణ తల్లి, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. Read Also: అలెర్ట్ :…
తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ నేతల అకృత్యాలకు ఉద్యోగులు, జనం బలి అవుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. వనమా రాఘవ ఎపిసోడ్ ముగియక ముందే.. నిజామాబాద్ లో మరో సంఘటన మొదలైందన్నారు. నిజామాబాద్ లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలు కారణం అన్నారు. ఎంపీ అరవింద్ అండ దండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకి మానవత్వం ఉంటే వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ…
సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే .. తెలంగాణలో ఈ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవరసరం లేదు. రాఘవకు ఎలాగైనా శిక్ష పడాలంటూ తన చివరి సెల్ఫీ వీడియోలో రామకృష్ణ కోరారు. కాగా తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయని, ఆత్మహత్య కేసులో…
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. Read Also: రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో కాగా రామకృష్ణ సెల్ఫీ…
తెలంగాణలో పాల్వంచ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది… బాధితుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ వీడియోలో రామకృష్ణ బయటపెట్టిన అంశాలు కలకలం సృష్టించగా.. తాజాగా, మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. భార్య, పిల్లలతో సహా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవతే కారణమని ఆ వీడియోలోనూ స్పష్టం చేసిన రామకృస్‌ణ.. రాఘవతో పాటు…
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న A2 నిందితుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అరెస్టును జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం శనివారం నాడు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. Read…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్‌రావు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాఘవ.. దౌర్జన్యాలు, కీచక పర్వాలు.. సెల్ఫీ వీడియోతో బయటపెట్టాడు రామకృష్ణ.. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు..…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. వనమా రాఘవ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం వనమా రాఘవను అరెస్ట్ చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని… ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ…