భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 3 వ తేదీన పాల్వంచలో రామకృష్ట అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని, ఆయన చేసిన అక్రమాల గురించి సెల్పీ వీడియోలో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. Read: చైనా…
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక వ్యాపారి కుటుంబం చావుకు కారణం అయ్యాడన్నారు. సీఎంకు మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవను అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. రాఘవను ముందే అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని లేఖలో వనమా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులకు, న్యాయవ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. వనమా రాఘవను నియోజకవర్గానికి,…
వరస వివాదాలతో ఆ సీనియర్ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్‌కు చీకట్లు అలముకున్నాయా? పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో కుటుంబ సభ్యులకూ టికెట్ కష్టమేనా? గేర్ మార్చడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు? ఆందోళన చెందుతున్నదెవరు? లెట్స్ వాచ్..! వనమా కుటుంబానికి రాజకీయ చీకట్లు..!వనమా వెంకటేశ్వరరావు. నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 18 ఏళ్లపాటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వనమా.. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు. వయసు పైబడుతున్న తరుణంలో రాజకీయంగా తన ఇద్దరు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎన్టీవీతో మాట్లాడుతూ.. రామకృష్ణ కుటుంబం ఆస్తి వివాదం గురించి మమ్మల్ని ఆశ్రయించారని, వారి ఇష్టపూర్తిగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబం వద్దకు రామకృష్ణ కుటుంబం రావడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని…