వనమా రాఘవను ఇంకా అరెస్ట్ చేయలేదు: పాల్వంచ ఏసీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. వనమా రాఘవ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం వనమా రాఘవను అరెస్ట్ చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని… ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ స్పష్టం చేశారు. బహుశా ఆయన తమకు చిక్కకుండా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే తాము కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు.
Read Also: రాజీనామా చేసే ఉద్దేశం లేదు: జగ్గారెడ్డి
Also Read
కాగా వనమా రాఘవను ప్రగతిభవన్‌లోనే దాచిపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను A1గా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మనవడిని ఒక్కమాటంటే గగ్గోలు పెట్టిన టీఆర్ఎస్ నేతలకు, సీఎం కేసీఆర్‌కు ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కనిపించట్లేదా అని ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..